logo
Published : 02/12/2021 05:44 IST

రిస్కు వద్దు.. మాస్కు ముద్దు

నల్గొండ మార్కెట్‌లో మాస్కులు ధరించకుండా కూరగాయల క్రయవిక్రయాలు

సూర్యాపేట (తాళ్లగడ్డ),  నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: ఒమిక్రాన్‌ కలకలం ప్రపంచ దేశాల్ని మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చే వారిపై గట్టి నిఘా పెడుతున్నారు. పాజిటివ్‌ తేలిన వారిని క్వారంటైన్‌ పంపడానికి ఆయా జిల్లాల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాకు ఒమిక్రాన్‌ భయం ఏమాత్రం లేనప్పటికీ కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారు ఇటీవల పెరుగుతున్నారు. కొవిడ్‌ బాధితులు చాపకింద నీరులా పెరుగుతున్నా ప్రజల్లో ఎక్కడా నిబంధనలు కన్పించడం లేదు. ఉమ్మడి జిల్లాలో నిత్యం మాస్కులు ధరించే వారు జనాభాలో 15 శాతం లేరని సంబంధిత అధికారులే వాపోతున్నారు. ఇక సామాజిక దూరం, శానిటైజర్లు వాడేవారు 5 నుంచి 8 శాతం మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే కొవిడ్‌ మూడో దశతో పాటు ఒమిక్రాన్‌ లాంటి లక్షణాలు వస్తే ఎదుర్కోవడం కష్టతరమేనని వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఒమిక్రాన్‌పై అసత్య ప్రచారం నమ్మొద్దు
డాక్టర్‌ అన్నిమల్ల కొండల్‌రావు, డీఎంహెచ్‌వో, నల్గొండ

జిల్లాలో ఇప్పటి వరకు మొదటి విడత కొవిడ్‌ టీకా తీసుకున్నవారు 90 శాతం మంది ఉన్నారు. మిగిలిన వారితో పాటు రెండో విడత టీకాలు పూర్తి చేయడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాం. ఇళ్ల వద్దకు వెళ్లి 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి టీకాలు వేయడంతో పాటు అర్హత ఉన్నవారు పొలాలు, ఇటుక బట్టీల వద్ద, వ్యాపార సంస్థల్లో ఉన్నా అక్కడకు వెళ్లి టీకాలు వేస్తున్నాం. మూడో విడత కొవిడ్‌ వచ్చినా, ఒమిక్రాన్‌పై అసత్యపు ప్రచారాలు నమ్మకూడదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వాటిల్లో పూర్తిస్థాయి వాస్తవాలు ఉండవు. అలాంటి లక్షణాలు ఉన్నవారు జిల్లాకు వచ్చినా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశాం.


పాఠశాలలో ముగ్గురికి కరోనా
నడిగూడెం: మండల పరిధిలోని రామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇద్దరు పదోతరగతి విద్యార్థులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకురాలికి బుధవారం కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల కిందట పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఆయన సెలవుపై వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ముందస్తు చర్యలలో భాగంగా వైద్య శాఖ సిబ్బంది పాఠశాలలో కొవిడ్‌ పరీక్షలు చేపట్టారు. ఇందులో ముగ్గురికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యాధికారిణి లక్ష్మిప్రసన్న తెలిపారు.  



 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని