logo

పేదలకు సంక్షేమ ఫలాలు: కలెక్టర్‌

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కలెక్టరేట్‌ ఆవరణలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కలెక్టరేట్‌లో బుధవారం గణతంత్ర దినోత్సవ

Published : 27 Jan 2022 03:50 IST

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కలెక్టరేట్‌ ఆవరణలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కలెక్టరేట్‌లో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్‌ ముందుగా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు నిరుపేదలకు అందేలా కృషి చేయాలన్నారు. ఎస్పీ రెమా రాజేశ్వరి, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్గొండ, మిర్యాలగూడ, సాగర్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, నోముల భగత్‌, పురపాలిక ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, చంద్రశేఖర్‌, సహాయ శిక్షణ కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌, అధికారులు పాల్గొన్నారు.

75 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆజాదికా అమృత్‌ వారోత్సవాలలో భాగంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ ఆధ్వర్యంలో నల్గొండలో 75మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ కార్యాలయం నుంచి పెద్ద గడియారం వరకు జాతీయ జెండాతో ప్రదర్శనగా వచ్చిన నాయకులు, విద్యార్థులు భారత్‌మాతాకు జై అంటూ నినాదాలు చేశారు.


జన గణ మన సంబరం

కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి,

చిత్రంలో డీఎస్పీ నారాయణరెడ్డి, తదితరులు

భువనగిరి, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ పమేలా సత్పతి జాతీయజెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అటవీశాఖలో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌ తివారి, డీసీపీ నారాయణరెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

భువనగిరి: జడ్పీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌

బీకూ నాయక్‌, డిప్యూటీ సీఈవో శ్రీనివాస్‌రావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని