logo

ఉత్తమ ప్రతిభావంతులకు పురస్కారాలు

విధుల్లో ఉత్తమ ప్రతిభన కనబరిచిన అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం పురస్కారాలు ప్రదానం చేసింది. ఇందులో జిల్లా అటవీశాఖ సిబ్బందికి ఐదు కేటగిరీలలో అవార్డులు లభించాయని డీఎఫ్‌వో డీవీరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన గణతంత్ర

Published : 27 Jan 2022 03:50 IST

జిల్లా అటవీశాఖ సిబ్బందికి ఐదు అవార్డులు
భువనగిరి, న్యూస్‌టుడే

మల్కాపూర్‌ బీట్‌కు చెందిన వన రక్షకులు బి.వకుళకుమారికి ప్రశంసాపత్రం అందజేస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పతి

విధుల్లో ఉత్తమ ప్రతిభన కనబరిచిన అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం పురస్కారాలు ప్రదానం చేసింది. ఇందులో జిల్లా అటవీశాఖ సిబ్బందికి ఐదు కేటగిరీలలో అవార్డులు లభించాయని డీఎఫ్‌వో డీవీరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ పమేలా సత్పతి వారికి పురస్కారాలు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు రూ.10వేల నగదు అందజేశారు.

ఉత్తమ ప్లాంటేషన్‌ కేటగిరీలో మల్కాపూర్‌ బీట్‌కు చెందిన వన రక్షకులు బి.వకుళకుమారికి అవార్డు లభించింది. మల్కాపూర్‌ అటవీ బ్లాక్‌లో ఐదు హెక్టార్లలో ఎల్‌ఐ పద్ధతిలో ప్లాంటేషన్‌, 3 హెక్టార్లలో యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ను పెంచారు. ఈ ప్లాంటేషన్‌ 85శాతం సర్వైవల్‌తో విజయవంతంగా పెంచినందుకు ప్రభుత్వం వకుళకుమారిని అవార్డుతో సత్కరించింది.

ఉత్తమ అటవీ బ్లాకుల రక్షణ కేటగిరీలో నారాయణపురంసెక్షన్‌కు చెందిన వనపాలకులు సీహెచ్‌ రాములుకు అవార్డు లభించింది. 5.40 హెక్టార్ల యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌, 554.90 హెక్టార్ల బ్లాక్‌, ఎస్‌ఎంఎం, ఎల్‌ఐ పద్ధతుల ప్లాంటేషన్లను విజయవంతంగా పెంచినందుకు అవార్డుతో సత్కరించారు.

ఉత్తమ అటవీబ్లాక్‌ కేటగిరిలో వాసాలమర్రి బీట్‌కు చెందిన వనరక్షకులు కె.మల్లేశ్‌కు అవార్డు లభించింది. వాసాలమర్రి, కొండాపూర్‌ ఖుర్ద్‌, గోపాల్‌పూర్‌-2 అటవీ ప్రాంతంలో పెర్కులేషన్‌ ట్యాంకులు నాలుగు, ఎస్‌సీటీలు 1850, చెక్‌డ్యాంలు రెండు విజయవంతంగా పూర్తిచేసినందుకు అవార్డు ప్రదానం చేశారు.

ఉత్తమ అటవీ బ్లాకు నివాస స్థలం, సహజ గడ్డి భూముల అభివృద్ధి కేటగిరీలో బొమ్మలరామాం బీట్‌ ఆఫీసర్‌ సహాయ వనరక్షకులు పురుషోత్తంకు అవార్డు లభించింది. సహాయ వన రక్షకులు అయినప్పటికీ అటవీ రక్షణలో భాగంగా అన్ని రకాల పనుల్లో చురుగ్గా పాల్గొన్నందుకు అవార్డు లభించింది.

ఉత్తమ అటవీ బ్లాకు, అటవీ బ్లాకుల పునర్జీవన ప్రణాళిక పూర్తి చేసిన కేటగిరీలో రాయగిరి బీట్‌ వనరక్షకులు పి.శ్రీనివాస్‌కు అవార్డు లభించింది. అటవీ బ్లాకుల్లో కష్టతరమైన భూ భాగాలు ఉన్నప్పటికీ మూడు చెక్‌డ్యాంలు, నాలుగు పెర్కులేషన్‌ ట్యాంక్‌లు, 17 ఫార్మ్‌ ఫాండ్లు చేపట్టినందుకు అవార్డు లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని