logo

మరో గురుకుల విద్యార్థి మృతి

చివ్వెంలలోని మహాత్మా జ్యోతిరావు ఫులే బాలుర గురుకుల పాఠశాల(నాగారం)లో నీటి సంపు గోడ కూలిన ఘటనలో చికిత్స పొందుతూ మరో విద్యార్థి మృతిచెందారు.

Published : 22 Mar 2023 04:05 IST

కొప్పుల యశ్వంత్‌

చివ్వెంల, శాలిగౌరారం, న్యూస్‌టుడే: చివ్వెంలలోని మహాత్మా జ్యోతిరావు ఫులే బాలుర గురుకుల పాఠశాల(నాగారం)లో నీటి సంపు గోడ కూలిన ఘటనలో చికిత్స పొందుతూ మరో విద్యార్థి మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 16న ఆ పాఠశాలలో గోడ కూలడంతో మోతె మండలం అప్పన్నగూడేనికి చెందిన విద్యార్థి పవన్‌ మృతి చెందిన విషయం తెలిసింది. గాయపడిన శాలిగౌరారం మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన కొప్పుల యశ్వంత్‌(10), మద్దిరాల మండలం చందుపట్లకు చెందిన సుశాంత్‌ చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వీరిలో యశ్వంత్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఆ విద్యార్థి మృతికి నల్గొండ జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి పొరుగు సేవల ద్వారా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని