logo

14 మంది పోటీ.. 12 మంది డిపాజిట్లు గల్లంతు

2018 ఆలేరు శాసనసభ ఎన్నికల్లో 14 మంది పోటీ పడ్డారు. మొత్తం 1,91,480 ఓట్లు పోలయ్యాయి

Published : 07 Nov 2023 04:43 IST

2018 ఆలేరు శాసనసభ ఎన్నికల్లో 14 మంది పోటీ పడ్డారు. మొత్తం 1,91,480 ఓట్లు పోలయ్యాయి. భారాస అభ్యర్థి గొంగిడి సునీతకు 94,870 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్థి బూడిద భిక్షమయ్య గౌడ్‌కు 61,784 ఓట్లు వచ్చాయి. 33,086 ఓట్ల మెజార్టీతో గొంగిడి సునీత విజయం సాధించారు. ఐతే మిగతా 12 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఐతే వీరిలో ఆలేరు నుంచి ఐదుసార్లు విజయం సాధించి ఉన్న మోత్కుపల్లి నర్సింహులు (బీఎల్పీ)కు 10,473 ఓట్లు, రెండోసారి పోటీచేసిన కల్లూరి రాంచంద్రారెడ్డి (బీఎస్పీ)కి 11,923, దొంతిరి శ్రీధర్‌రెడ్డి (భాజపా) 4,967 ఓట్లు వచ్చాయి. మిగతా వారికి నోటా 1464 ఓట్ల కంటే తక్కువ వచ్చాయి. ఇలా 14 మంది పోటీలో 12 మంది ధరావతు కోల్పోయారు.
యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని