logo

కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి

బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్‌ న్యాయస్థానం జూనియర్‌ సివిల్‌ జడ్జి మహతి వైష్ణవి సూచించారు.

Updated : 29 Mar 2024 06:19 IST

చౌటుప్పల్‌ న్యాయస్థానం జడ్జి మహతి వైష్ణవి

చౌటుప్పల్‌లోని గురుకుల విద్యాలయంలో మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి మహతి వైష్ణవి

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్‌ న్యాయస్థానం జూనియర్‌ సివిల్‌ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. పీఎంశ్రీ పథకంలో సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా ఎంపికైన చౌటుప్పల్‌ బంగారుగడ్డలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయంలో ‘బాలికా సాధికారత’పై గురువారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో ఆటుపోట్లు ఎదురైనా, వైఫల్యాలు వెంటాడినా అధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఆడపిల్లలమని ఆత్మన్యూనతకు గురి కావద్దని, మేము సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధనకు రెట్టించిన ఉత్సాహంతో కృషి చేయాలని తెలిపారు. తన స్వీయ అనుభవాన్ని వివరించారు. విద్యార్థినులను చైతన్యపర్చే గీతాన్ని ఆమె ఆలపించారు. ప్రిన్సిపల్‌ సరోజమ్మ, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.అలివేలు, సహాయ ప్రిన్సిపల్‌ మణిమాల పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని