logo

మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు

మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.

Published : 30 Apr 2024 05:08 IST

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన బూడిద బాలనర్సయ్య(47) వ్యవసాయదారుడు. 2016లో నల్గొండ జిల్లాకు చెందిన మతిస్థిమితం సరిగా లేని ఓ బాలిక (16)ను అపహరించి.. బంధువుల ఇంట్లో బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఓ ఆలయంలో బాలిక మెడలో బలవంతంగా తాళికట్టి పెళ్లి అయినట్లు నమ్మించాడు. సమాచారం అందుకున్న మంచాల పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత నిందితుడిపై కోర్టులో అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా 9వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి హరీశ సోమవారం తుదితీర్పు వెల్లడించారు. బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం మంజూరు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు న్యాయమూర్తి సిఫార్సు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని