logo

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!

ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై  ఉన్న ఆసక్తి లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం.

Updated : 30 Apr 2024 06:23 IST

నేడు ‘జాతీయ నిజాయతీ దినోత్సవం’

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి సిరా గుర్తు చూపుతున్న వృద్ధుడు

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై  ఉన్న ఆసక్తి లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. దేశ సమగ్రతను కాపాడే నాయకులను ఎన్నుకునేందుకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు నిజాయతీగా తమ ఓటు హక్కు వినియోగించుకుని అవినీతిని అంతమొందించేందుకు పాటుపడాలి. నేడు ‘జాతీయ నిజాయతీ దినోత్సవం’ సందర్భంగా ప్రతి ఓటరూ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతినబూనాలి.

ఏమీ ఆశించకు..

ఓటు హక్కు వినియోగానికి ప్రస్తుత రోజుల్లో ఓటర్లు ఏదో ఒక బహుమతికి ఆశ పడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో జరిగిన పలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటర్లు తమకు ఆశించిన, వారు హామీ ఇచ్చిన బహుమతులు రాలేదని ఓటు వేయడం బహిష్కరించిన ఘటనలు వెలుగు చూశాయి. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని.. ఓటర్లు స్వచ్ఛందంగా, నిజాయతీతో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య వాదులు కోరుతున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలకు ఆశపడితే ఓటు విలువ దిగజారిపోతుందని..ఈ ఎన్నికల్లో గతంలో కంటే పోలింగ్‌ శాతం పెరిగేందుకు ఓటర్లు ఎవరికి వారే ముందుకు రావాలని కోరుతున్నారు.            

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని