logo

వైద్యుల అర్హతలు బోర్డుల మీద బహిర్గతం చేయండి

అర్హతలు లేకుండానే ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న తీరుపై గత నెల 18న ‘నాడి తెలియని నకిలీలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది.

Published : 03 May 2024 02:01 IST

కోదాడ, న్యూస్‌టుడే: అర్హతలు లేకుండానే ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న తీరుపై గత నెల 18న ‘నాడి తెలియని నకిలీలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా వైద్యాధికారి కోటచలం గురువారం పట్టణంలోని పలు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. హుజూర్‌నగర్‌ రోడ్డులోని రెండు ఆసుపత్రుల్లో అర్హత లేని వైద్యులు వైద్యం చేస్తున్నారని, మందులు విక్రయించే వ్యక్తికి కూడా అర్హతలు లేవని, దీంతో ఆ రెండు ఆస్పత్రులను సీజ్‌ చేసినట్లు తెలిపారు. సరైన ధ్రువపత్రాలు సమర్పించే వరకు ఆస్పత్రులు తెరవొద్దని యాజమాన్యాలను హెచ్చరించారు. ఆస్పత్రుల్లో వైద్యులు తమ అర్హతలు, రిజిస్ట్రేషన్‌ నంబర్లు బోర్డుల మీద తప్పనిసరిగా బహిర్గతం చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో నిరంజన్‌, కల్యాణ్‌ చక్రవర్తి, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని