logo

యాదాద్రిలో భక్తుల మొక్కు పూజలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సెలవు రోజు కావడంతో క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగి.. దర్శనం కోసం సుమారు రెండు గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Published : 06 May 2024 02:39 IST

యాదాద్రి సన్నిధిలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సెలవు రోజు కావడంతో క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగి.. దర్శనం కోసం సుమారు రెండు గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేకువజాము నుంచి దైవారాధనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. సుప్రభాతం అనంతరం బిందె తీర్థంతో పూజారులు చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా సాగాయి. మూలవరులను మేల్కొల్పిన పూజారులు హారతితో కొలిచి.. పంచామృతంతో అభిషేకించి తులసీ దళాలతో అర్చన చేపట్టారు. భక్తులకు దర్శనమిచ్చే కవచమూర్తులకు సువర్ణ పుష్పార్చన పర్వాలు జరిపారు. అష్టభుజి మండప ప్రాకారంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణం ఆలయ ఆచారంగా నిర్వహించారు. అలంకార జోడు సేవలను సాయంత్రం మంగళ వాయిద్యాల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తుల ఆరాధనలతో పూజా మండపాలు కోలాహలాన్ని నింపుకొన్నాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.53,32,909 ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని