logo

నిర్లక్ష్యమా.. అవగాహన లోపమా..!

ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వినియోగించుకునే వారిలో 90శాతం పైగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటారు

Updated : 10 May 2024 07:03 IST

ఎన్నికల్లో తిరస్కరణకు గురవుతున్న పోస్టల్‌ బ్యాలెట్లు

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వినియోగించుకునే వారిలో 90శాతం పైగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటారు. అయినా పలు ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తిరస్కరణకు గురవ్వడంలో సిబ్బంది నిర్లక్ష్యమా..? ఓటు వేసే విధానంలో అవగాహన లోపమా అనేది స్పష్టం కావట్లేదని పలువురు అధికారులు అంటున్నారు.  ఓటు వేసేటప్పుడు అన్ని పత్రాలు సక్రమంగా సరి చూసుకోవాలని ప్రజాస్వామ్య వాదులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని