logo

సర్పంచుల ఒత్తిడితోనే ఆర్థిక సంఘం నిధుల విడుదల

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తరువాత రూ.988 కోట్లు విడుదల అయ్యాయని సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్‌ రెడ్డి తెలిపారు.

Published : 20 Apr 2024 04:44 IST

మాట్లాడుతున్న సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్‌రెడ్డి

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తరువాత రూ.988 కోట్లు విడుదల అయ్యాయని సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన నెల్లూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు.  కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండో విడత కింద రూ.988 కోట్లు పంపితే వాటిని పంచాయతీల ఖాతాల్లో వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి మళ్లించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఈ విషయంపై ఈనెల 15న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనాని కలసి సర్పంచులు ఫిర్యాదు చేశామని తెలిపారు.గతంలో పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ.8,629 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని.. ఆ నిధులు కూడా గ్రామ పంచాయతీల ఖాతాలకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం విజయవాడలోని మాకినేని బసవయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామాల సమస్యలపై సర్పంచులతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సుకు ఉమ్మడి జిల్లాల సర్పంచులు హాజరుకావాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.కె.శ్రీనివాస్‌, మాజీ నాయకుడు మధునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని