logo

మాటలే.. పనుల్లేవ్‌!

పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్‌, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు.

Published : 20 Apr 2024 04:47 IST

అమలుకాని సీఎం, ఎమ్మెల్యే హామీ

అభివృద్ధికి నోచుకోని ట్రంకురోడ్డు

పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్‌, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు. విస్తరణ పనులు నిలిచిపోయి ఏడాది దాటుతోంది.

న్యూస్‌టుడే, కావలి

పట్టణంలో నుంచి వెళ్లే ట్రంకురోడ్డుకు ఇరువైపులా జనావాసాలు పెరిగాయి. ఆరుకిలోమీటర్ల వరకు ఉన్న మార్గంలో నిత్యం ట్రాఫిక్‌ ఇక్కట్లు నెలకొంటున్నాయి. ఈనేపథ్యంలో దీన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.56 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇరువైపులా ఉన్న విద్యుత్తు లైన్లు మార్చాలి. దీనికి డిస్కంకు ధరావత్తు చెల్లించాల్సి ఉంది. పురపాలక సంఘం చెల్లిస్తుందని భావించారు. అంత మొత్తం చెల్లించేందుకు  నిధుల వెసులుబాటు లేదని పురపాలక సంఘం చేతులెత్తేసింది. దీంతో గత ఏడాది మే 12న కావలికి సీఎం వచ్చిన సమయంలో ట్రంకురోడ్డు పనులకు మరో రూ.15 కోట్లు అదనంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిధుల విడుదల లేదు సరి కదా, ముందుగా జరుగుతున్న పనులకు ప్రభుత్వ విధానంతో అడ్డంకులు ఏర్పడ్డాయి.

59  జీవోతో ఇక్కట్లు

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన జీవో 59 ప్రకారం ఆర్థిక కేటాయింపులకనుగుణంగా ఇంజినీరింగ్‌ విభాగాలు పనులను చేయాలి. కేటాయింపులకు మించి చేస్తే ఈఈలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈమెలికతో ఈఈ వెనుకడుగు వేశారు. మూడేళ్ల క్రితం ప్రారంభించగా  నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు ముసునూరు ప్రాంతంలో కాలువల నిర్మించారు.

ఎమ్మెల్యే తొలి కోరిక

సీఎం జగన్‌ పదవీ బాధ్యతలు సీˆ్వకరించాక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అడిగిన తొలి కోరిక ఇదే. దీన్ని పూర్తి చేస్తానని ప్రతి సభలోనూ గొప్పగా చెప్పారు. అయిదేళ్లయినా అయిదుశాతం కూడా కనిపించకపోవడం విశేషం. ఆయన ఇంటి ముందు దెబ్బతిన్నా చేయించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని