logo

అమ్మో దారి.. గుండెజారి

జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది.

Published : 24 Apr 2024 04:39 IST

గోతుల మధ్య ద్విచక్ర వాహనదారుడి అవస్థ

జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. నెల్లూరు-పెంచలకోన మార్గంలో ఆదూరుపల్లి నుంచి పెంచలకోన వరకు 32 కి.మీ. దూరం ఏక వరుసలో ఉంటుంది. కొన్నేళ్లుగా ఈ రోడ్డు గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. కనీస మరమ్మతులు చేయలేదు. ఫలితంగా పూర్తిగా దెబ్బతింది. వాహనం నడపడం చోదకులకు సవాలుగా మారింది. అసలే 40కిపైగా మలుపులు.. ఆ పై భారీ గోతుల కారణంగా ఇప్పటికే పలువురు ప్రమాదాల బారిన పడ్డారు. రెండు వరుసలుగా విస్తరించాలన్న ప్రజల విజ్ఞప్తులు పట్టించుకున్నవారే లేవు. ఇప్పుడు మరమ్మతులైనా చేయండని వేడుకుంటున్నా వినిపించుకోవడం లేదు. త్వరలో బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఇకనైనా దృష్టిసారించాలని కోరుతున్నారు.

న్యూస్‌టుడే, చేజర్ల

యాత్రికుల పాట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని