logo

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సోమవారంతో నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది.

Published : 30 Apr 2024 04:39 IST

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సోమవారంతో నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఉపసంహరణ గడువు ముగియడంతో మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్‌ అధికారులు సోమవారం విడుదల చేశారు. అత్యధికంగా కందుకూరు నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండటం గమనార్హం.

ప్రక్రియ విజయవంతం ..  నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, అభ్యర్థులంతా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సూచించారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో కలెక్టరేట్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వికలాంగులు, 85 సంవత్సరాలు దాటిన వృద్ధుల అనుమతి మేరకు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1712 మందిని ఇందుకు గుర్తించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని