logo

ఈ జలం గరళం

వేసవికాలం వచ్చింది. తాగునీటి వనరులు అడుగంటి కలుషితమవుతాయి. ఈనీరు తాగి వ్యాధులు ప్రబలుతాయి.

Published : 06 May 2024 05:52 IST

నెల్లూరు వెంగళరావు నగర్‌లో మురుగు కాలువల్లో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులో

వృథాగా పోతున్న మంచినీరు .. లీకేజీ కారణంగా మంచినీరు లీకై మురుగుకాలువలా మారిందిలా..

మైపాడు రోడ్డు కిసాన్‌ నగర్‌లో మురుగునీటిలో ఇంటికెళ్లే పైపు

వేసవికాలం వచ్చింది. తాగునీటి వనరులు అడుగంటి కలుషితమవుతాయి. ఈనీరు తాగి వ్యాధులు ప్రబలుతాయి. ఈపరిస్థితుల్లో సరఫరాలో పుర అధికారులు ప్రమాణాలు పాటించడం లేదు. నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా పైపులైన్లు, ఇళ్లకు ఇచ్చే కనెక్షన్ల పైపులు మురుగుకాలువల్లో ఉంటున్నాయి.  వీధి కుళాయిల చుట్టూ మురుగు తాండవిస్తోంది. వాల్వుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ గుంతల్లో చెత్త పేరుకుపోయింది. కావలిలో అయితే దశాబ్దాల క్రితం వేసిన పైపులకు లీకులు పడి  కలుషితమై సరఫరా అవుతోంది. అయిదేళ్లుగా ఈపరిస్థితులను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైంది.

కావలి బాలకృష్ణారెడ్డినగర్‌ ఆంజనేయ విగ్రహం వాల్వు నుంచి లీకవుతున్న నీరు

ఈనాడు, నెల్లూరు, న్యూస్‌టుడే, కావలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని