logo

పథకాలు నిర్వీర్యం అర్చకులపై దౌర్జన్యం

గత తెదేపా ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయిదేళ్లలో తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్చకులపై అధికార వైకాపా దౌర్జన్యాలు తప్ప..

Published : 07 May 2024 04:05 IST

అయిదేళ్లలో ప్రభుత్వం చేసిందేమి లేదంటున్న బ్రాహ్మణులు
న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్‌)

గత తెదేపా ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయిదేళ్లలో తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్చకులపై అధికార వైకాపా దౌర్జన్యాలు తప్ప.. అభివృద్ధి లేదని విమర్శిస్తున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే వైకాపా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించిందని ఆరోపిస్తున్నారు. తెదేపా ప్రభుత్వంలో పదో తరగతి చదివే బ్రాహ్మణ విద్యార్థులకు రూ.10 వేలు, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు రూ.20 వేలు ఇచ్చేవారు. వాటిని కూడా తీసేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా వాహనాలకు ఇచ్చే రుణాలు ఆపేశారు. తెదేపా మేనిఫెస్టోలో బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.


కార్పొరేషన్‌ను పట్టించుకోలేదు

-పీవీ నరసింహారావుశర్మ, నెల్లూరు

వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసింది. పథకాలను రద్దు చేసింది. బ్రాహ్మణ సమాజం ఆలోచించి తెదేపాకి ఓటు వేస్తాం. దేవాలయాలపై, అర్చకులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెదేపా మ్యానిఫెస్టోలో చూపారు.


రథాలు తగలబెట్టారు

-గట్టుపల్లి రమేష్‌కుమార్‌, బ్రహ్మదేవం గ్రామం

వైకాపా ప్రభుత్వంలో రథాలను కూడా తగులబెట్టారు. జగన్‌ అధికారంలోకి రాగానే బ్రాహ్మణులను విస్మరించారు. తెదేపా మ్యానిఫెస్టో బాగుంది. హిందూ దేవాలయాలను కాపాడేందుకు హిందూ బోర్డును ఏర్పాటు చేస్తాననడం సంతోషంగా ఉంది.


వాహన రుణాలు ఆపేశారు

-ధనుంజయ, నెల్లూరు

చంద్రబాబునాయుడు 2014లో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలో వృద్ధులు ఎంతమంది ఉన్నా పింఛను ఇచ్చారు. దానిని 2019లో వైకాపా ప్రభుత్వం తీసేసి సాధారణ పింఛనులో కలిపేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా వాహనాలకు ఇచ్చే రుణాలు ఆపేశారు.


రక్షణ కరవు

-ఆలూరు వెంకట విష్ణువర్ధన్‌రావు, ముత్తుకూరు

వైకాపా ప్రభుత్వంలో దేవాలయాలు, రథాలు తగులబెట్టినా పట్టించుకోలేదు. బ్రాహ్మణులను వైకాపా వారు వచ్చి కొట్టినా రాజీ చేసి పంపించారు. రక్షణ లేకుండా పోయింది.


కార్యాలయానికి తాళాలు

-ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్‌

చంద్రబాబునాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ విద్యార్థికి విదేశీ విద్య కోసం రూ.10 లక్షలు ఇచ్చారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేషన్‌ కార్యాలయానికి తాళాలు వేసేశారు. బ్రాహ్మణుల సంక్షేమాన్ని చంద్రబాబు మ్యానిఫెస్టోలో పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని