logo

తల్లీ బిడ్డ ఆరోగ్యంగా వుండాలి

పట్టణంలో వెంగళరాపు నగర్  పీహెచ్‌సీ,  డాక్టర్ రామ్ సెంటర్, జవహర్ భారతి విశ్వోదయ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

Published : 09 May 2024 13:41 IST

కావలి: పట్టణంలో వెంగళరాపు నగర్  పీహెచ్‌సీ,  డాక్టర్ రామ్ సెంటర్, జవహర్ భారతి విశ్వోదయ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ  వైద్యురాలు  డాక్టర్ రమ్య మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవడం ద్వారా మాతా శిశు మరణాలు నివారించవచ్చన్నారు.  రక్త హీనతను అధిగమించాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని,  గర్భిణులు  వైద్యుల సలహాలు పాటించాలని సూచించారు.  అనంతరం  డాక్టర్ రామ్ సెంటర్ విశ్వోదయ సంస్థ ప్రతినిధులు ఐరన్ పొలిక్ , కాల్షియం, విటమిన్స్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ సెంటర్  ఛైర్మన్ దొడ్ల మనోహరరెడ్డి , డైరెక్టర్ కూనం తాతిరెడ్డి , సామాజిక కార్యకర్త యం.మాలకొండారెడ్డి, సూపర్‌వైజర్ సుగుణమ్మ , ఏఎన్‌ఎమ్‌లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని