logo

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జహీరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు.

Published : 23 May 2024 02:05 IST

మాట్లాడుతున్న సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్‌ : ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జహీరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డిలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఓట్ల లెక్కింపు సూపర్‌వైజర్లు, సహాయకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జూన్‌ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో 153 మంది సూపర్‌వైజర్లు, 173 మంది సహాయకులు పాల్గొంటారన్నారు. 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండో విడత శిక్షణ అనంతరం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సిబ్బందిని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు పాండు, అశోక చక్రవర్తి, మాస్టర్‌ ట్రైనర్‌ కృష్ణకుమార్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన కౌంటింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని