logo

కల్తీ చేస్తూ.. విక్రయిస్తూ..

మద్యం మత్తు మనుషులకు వివిధ రకాలుగా చేటు చేస్తుంది. అదే కల్తీ మద్యం తాగితే పరిస్థితి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతుంది. మద్యం ప్రియులు తాగుతున్నప్పుడు తాము తీసుకునేది అసలైనదా.. కాదా.. అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated : 23 May 2024 06:20 IST

మద్యం దుకాణాదారుల దందా
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నేర విభాగం

మద్యం సీసాల్లో నీరు కలిపిన నిందితుడిని పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు 

  • నగరంలోని పరమేశ్వరీ వైన్సులో కల్తీ మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో ఈనెల 9న ఆబ్కారీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. వైన్సు నిర్వాహకులు ఎక్కువ ధర ఉన్న మద్యం సీసాల్లో నీళ్లు కలిపి కలుపుతున్నట్లు గుర్తించారు. దుకాణం యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అక్కడ దొరికిన మద్యాన్ని ల్యాబ్‌కు పంపించడంతో విషయం బయటకు వచ్చింది. దుకాణం యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

  • ఖానాపూర్‌ శివారులోని ఓ మద్యం దుకాణంలో ఒకరు బీరు సీసా కొనుక్కున్నాడు. సీల్‌ ఉన్న సీసాను పరిశీలిస్తే అందులో చెత్త కనిపించింది. ఇలాంటి బీర్లు అమ్మి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటూ సదరు వ్యక్తి సామాజిక మాధ్యమంలో పెట్టిన వీడియో వైరల్‌ అయ్యింది.

ద్యం మత్తు మనుషులకు వివిధ రకాలుగా చేటు చేస్తుంది. అదే కల్తీ మద్యం తాగితే పరిస్థితి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతుంది. మద్యం ప్రియులు తాగుతున్నప్పుడు తాము తీసుకునేది అసలైనదా.. కాదా.. అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 102 వైన్సు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో లక్కీ డ్రా ద్వారా వీటిని వ్యాపారులు సొంతం చేసుకున్నారు. 2023 డిసెంబర్‌ నుంచి కొత్త యజమానులు వీటిని నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు నిబంధనలకు లోబడి కల్తీ లేని మద్యం విక్రయించాలి. కానీ అలా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లాభాల వేటలో పడి   తప్పుదారి..

ఈ వ్యాపారంలోకి కొత్తగా వచ్చినవారిలో కొందరు లాభాలు దండుకోవాలని చూస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆర్జించడానికి తప్పుదారిలో వెళ్తున్నారు. ఫలితంగా అధిక ధరకు విక్రయించే సీసాల్లో తక్కువ వెల ఉన్న మద్యం, నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ నిఘా పెంచితేనే వీరి చర్యలను అరికట్టవచ్చు.

అనుమానం వస్తే  ఫిర్యాదు చేయాలి

మద్యం కొనుగోలు చేసేప్పుడు ఎలాంటి అనుమానాలు వచ్చిన ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం అందించాలి. సమాచారం అందిన వెంటనే అధికారులు వచ్చి మద్యం నాణ్యతను పరిక్షిస్తారు తేడా అనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు.


కఠిన చర్యలు తీసుకుంటాం
- మల్లారెడ్డి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, నిజామాబాద్‌ 

మద్యం దుకాణాలు సజావుగా నిర్వహించడానికి కావాల్సిన సహకారాలు మా శాఖ నుంచి ఉంటాయి. వ్యాపారం ముసుగులో తప్పుదోవ పడితే ఉపేక్షించం. ప్రతి దుకాణంపై నిఘా ఉంటుంది. గత రికార్డులతో పోలిస్తే అమ్మకాలు ఎలా ఉన్నాయనేది ఆరా తీస్తాం. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారులు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎక్కడ అనుమానం వచ్చినా దాడులు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని