logo
Published : 01/12/2021 04:19 IST

న్యాక్‌తో మెరిసింది

మోర్తాడ్‌ డిగ్రీ కళాశాలకు బీ గ్రేడ్‌
న్యూస్‌టుడే, మోర్తాడ్‌

విద్యార్థులకు డిజిటల్‌ తెరపై బోధిస్తున్న అధ్యాపకురాలు

దేశంలోని డిగ్రీ, పీజీ కళాశాల్లో వసతులు, సదుపాయాలను నేషనల్‌ అసెస్‌మెంటు అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌) బృందం తెలుసుకొని గ్రేడ్‌ రూపంలో పనితీరును అంచనా వేస్తుంది. ఇటీవల ముజాం అలీ(అంబేడ్కర్‌ వర్సిటీ, లఖ్‌నవూ, ఉత్తర్‌ప్రదేశ్‌), పూనమ్‌ వర్మ(యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ), జాకోబ్‌ ఫిలిప్‌(కొచిన్‌ వర్సిటీ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ, కేరళ) మోర్తాడ్‌ డిగ్రీ కళాశాలను సందర్శించారు. 2014 - 2018 వరకు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, రికార్డులు, ప్రాజెక్టులు, టాస్క్‌, వర్చువల్‌, డిజిటల్‌ తరగతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితర వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను బెంగళూరుకు పంపారు. వారు 2.17 సీజీపీఏతో కళాశాలకు న్యాక్‌ ‘బీ’ గ్రేడ్‌ ఇచ్చారు. దీంతో యూజీసీ నుంచి కళాశాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. తగిన గుర్తింపుతో పాటు విద్యార్థుల ధ్రువపత్రాలపై న్యాక్‌ ‘బీ’ గ్రేడ్‌ ముద్రించనున్నారు.

పలు రకాల సౌకర్యాలు....
ఐదెకరాల విస్తీర్ణంలో సొంత భవనం ఉంది. అధ్యాపకులు 28, విద్యార్థులు 542 మంది ఉన్నారు. నాలుగు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అధునాతన కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌లు, డిజిటల్‌ బోధన, సరిపడే తరగతి గదులు కళాశాల సొంతం. ఉద్యోగ ప్రవేశ పరీక్షల సన్నద్ధతకకు రెండు వేల పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంది. నేషనల్‌ సర్వీస్‌ స్కీం(జాతీయ సేవా పథకం)లో భాగంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ చేపడుతున్నారు. చివరి సంవత్సరం విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ చేసి పీజీ ఎంట్రెన్స్‌ శిక్షణ ఇస్తున్నారు. పీపీటీ(పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌) ద్వారా ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని వారి కోసం ఆన్‌లైన్లో బోధిస్తున్నారు. హరితహారంలో భాగంగా 800 మొక్కలు నాటి పెంచుతున్నారు.


డిజిటల్‌ తరగతులతో ప్రయోజనం

విజయ, బీఎస్సీ తృతీయ సంవత్సరం
డిజిటల్‌ తరగతులు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయి. అధ్యాపకులు ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేస్తూ అర్థమయ్యేలా బోధిస్తున్నారు.


రెండు వేల పుస్తకాలు ఉన్నాయి
జ్యోతి, బీఎస్సీ విద్యార్థిని

గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలతో పోటీ పరీక్షలకు సిద్ధం కావొచ్చు. బయట కొనుగోలు చేసే భారం తప్పింది. ప్రైవేటుకు దీటుగా బోధన అందుతోంది.


విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
- పెద్దన్న, ప్రిన్సిపల్‌, మోర్తాడ్‌

న్యాక్‌ ‘బీ’ గ్రేడ్‌ గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు ఎన్నో విలువైన సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. నాణ్యమైన బోధన అందుతుంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని