logo

ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనే అధికంగా...

ర్యాపిడ్‌ కన్నా ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనే అధికంగా పాజిటివ్‌లు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తక్కువ పరీక్షల్లోనే ఎక్కువ మందికి వైరస్‌ నిర్ధారణవుతుండటం కలకలం రేపుతోంది. శుక్రవారం 58 ర్యాపిడ్‌ పరీక్షల్లో 7, 115

Published : 15 Jan 2022 03:16 IST

న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం : ర్యాపిడ్‌ కన్నా ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనే అధికంగా పాజిటివ్‌లు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తక్కువ పరీక్షల్లోనే ఎక్కువ మందికి వైరస్‌ నిర్ధారణవుతుండటం కలకలం రేపుతోంది. శుక్రవారం 58 ర్యాపిడ్‌ పరీక్షల్లో 7, 115 ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో 28 మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
1,479 మందికి టీకా
కామారెడ్డి పట్టణం :  జిల్లాలోని ఆయా ఆరోగ్యకేంద్రాల పరిధిలో శుక్రవారం 1,479 మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయింది. పండగ వేళ టీకా పంపిణీ మందగించింది. బాన్సువాడలో 102, రాజీవ్‌నగర్‌ 91, నిజాంసాగర్‌ 89, మత్తమాల 50, ఆర్గొండ 58, కొండాపూర్‌ 77, ఎర్రాపహాడ్‌ 50, తాడ్వాయి 70, దుర్కి 50, బాణాపూర్‌ 50, చిన్నకొడంగల్‌లో 69 మందికి వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని