logo

అతివలకు ఈ-వాహనాలు

కామారెడ్డి జిల్లాలో ఐకేపీ, మెప్మా మహిళా సంఘాలు 21,958 ఉండగా 2,19,580 సభ్యులున్నారు. జిల్లాలో రాజంపేట నుంచి ఇప్పటి వరకు ఈ- ఆటో కోసం ఒక్క దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Published : 23 Jan 2022 04:19 IST

స్త్రీనిధి ద్వారా రుణ సదుపాయం 

బైకులు, ఆటోల కొనుగోలుకు చేయూత

న్యూస్‌టుడే, బీర్కూర్‌

కామారెడ్డిలో లబ్ధిదారుడికి ఆటో అందజేస్తున్న స్త్రీనిధి జోనల్‌ మేనేజర్‌ రవికుమార్‌, కంపెనీ ప్రతినిధులు

పస్తుతం పెరిగిన పెట్రోలు, డీజిలు ధరలతో పాటు వాతావారణ కాలుష్యం పెరగడంతో సామాన్యులు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి పథకం ద్వారా ఆటో, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రుణాలను అందిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఐకేపీ, మెప్మా అధికారులు గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ఈ-వాహనాలపై అవగాహన కల్పిస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలో ఐకేపీ, మెప్మా మహిళా సంఘాలు 21,958 ఉండగా 2,19,580 సభ్యులున్నారు. జిల్లాలో రాజంపేట నుంచి ఇప్పటి వరకు ఈ- ఆటో కోసం ఒక్క దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

పథకం విధి విధానాలు
* ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌లోని గ్రామ/స్లమ్‌ సంఘాలకు అనుబంధంగా ఉండే సంఘాల్లోని సభ్యులు ఈ రుణం పొంద వచ్చు. ప్యాసింజర్‌, ట్రాలీ ఆటోలను ప్రజా రవాణా, సరకుల రవాణా కోసం వినియోగించుకోవచ్చు. గ్రామ సంఘంలో సభ్యురాలై ఉండాలి. గతంలో స్త్రీనిధి రుణం తీసుకొని ఉన్నప్పటికీ అప్పు ఉండకూడదు.
* గ్రామ సంఘం తీర్మాన పత్రాన్ని ఐకేపీ కార్యాలయంలో అందజేయాలి. స్త్రీనిధి వెబ్‌సైట్లో ఆన్‌లైన్లో వివరాలను సీసీలు నమోదు చేస్తారు. సభ్యురాలు తొలుత వ్యక్తిగత ఖాతాలో రూ.15 వేలు జమ చేసి ఉండాలి. ఆటో కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా రూ.2.85 లక్షల రుణాన్ని గ్రామ సంఘం ఖాతాలో జమ చేస్తుంది. ప్రభుత్వం రూ.70 వేల రాయితీ కల్పిస్తుంది. మొత్తం రూ.3 లక్షల రుణం లభిస్తుంది. మహీంద్రా కంపెనీలో ఈ- వాహనాలను కొనుగోలు చేయాలి. తీసుకొన్న రుణాన్ని ప్రతి నెలా రూ.6,700 వాయిదాను ఐకేపీ కార్యాలయంలో చెల్లించాలి. 60 నెలల్లో రుణం చెల్లించాలి. మొత్తం రుణం చెల్లించే వరకు వాహనాన్ని ఎవరికి విక్రయించేందుకు వీలుండదు. మొత్తం రుణం చెల్లించాక ఎన్‌వోసీ పత్రాన్ని అందజేస్తారు. ఈ ఎలక్ట్రిక్‌ ఆటోలో నలుగురి నుంచి ఐదుగురు వరకు ప్రయాణించవచ్చు. 500 కిలోల వరకు సరకు రవాణా చేయవచ్చు.

ద్విచక్రవాహనం విధానాలు
సంఘంలో సభ్యురాలిగా ఉండాలి. గతంలో ఏ అప్పులు తీసుకున్నా కూడా ఈ- ద్విచక్ర వాహనం రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.75 వేలు రుణం మంజూరు చేస్తుంది. రిజిస్ట్రేషన్‌ కాని ద్విచక్ర వాహనాలకు ఎలాంటి రాయితీ లేదు. రిజిస్ట్రేషన్‌ చేసుకొన్న వాహనాలకు రూ.22 వేలు రాయితీ అందిస్తుంది. ప్రతి నెలా రూ.1700 కిస్తు చెల్లించాలి. 48 నెలల్లో రుణాన్ని వాయిదాలలో చెల్లించాలి.


తీసుకొనేందుకు ముందుకు రావాలి
..రవికుమార్‌, స్త్రీనిధి జోనల్‌ మేనేజర్‌, కామారెడ్డి

ర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఈ-వాహనాల కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తూ ప్రోత్సాహకం అందిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణం మంజూరు చేస్తాం. తీసుకొనేందుకు ముందుకు రావాలి. ఐకేపీ, మెప్మా అధికారులు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని