logo

కమల దళం సిద్ధం

భాజపా అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి ఐదు టికెట్లు ఖరారయ్యాయి. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ నుంచి పైడి రాకేశ్‌రెడ్డికి అవకాశం దక్కింది.

Published : 23 Oct 2023 04:50 IST

ఉమ్మడి జిల్లాలో ఐదు స్థానాల్లో భాజపా అభ్యర్థులు ఖరారు

భాజపా అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి ఐదు టికెట్లు ఖరారయ్యాయి. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ నుంచి పైడి రాకేశ్‌రెడ్డికి అవకాశం దక్కింది. కామారెడ్డి నుంచి అందరూ అనుకుంటున్నట్లుగానే కాటిపల్లి వెంకట రమణారెడ్డి బరిలో దిగనున్నారు. జుక్కల్‌ నుంచి కామారెడ్డి భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బాల్కొండ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మకు టికెట్‌ ఇచ్చారు. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఎంపీ అర్వింద్‌ జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి బరిలోకి దిగనున్నారు. మిగతా స్థానాల్లో ఎవరనేది ఇంకా తేలలేదు. అయితే ఇప్పటికే అధికార భారాస తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో ముందుంది. ఉమ్మడి జిల్లాలో ఆర్మూర్‌, బోధన్‌, బాల్కొండ స్థానాలకు మాత్రమే కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ప్రకటించింది. భాజపా అభ్యర్థుల వివరాలు ఇవి..


  • బాల్కొండ
  • ఏలేటి అన్నపూర్ణమ్మ
  • 07-05-1955
  • భర్త: ఏలేటి మహిపాల్‌రెడ్డి  
  • మల్లికార్జున్‌రెడ్డి, నాగార్జున్‌రెడ్డి
  • పీయూసీ
  • భర్త ఏలేటి మహిపాల్‌రెడ్డి ఎన్టీఆర్‌ క్యాబినేట్‌లో అటవీశాఖ మంత్రిగా పని చేశారు. 1991లో ఆయన మరణంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు 1994, 2009లో ఆర్మూర్‌ నుంచి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేగా పని చేశారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఉమెన్స్‌ వెల్ఫేర్‌ కమిటీ ఛైర్మన్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పని చేశారు.
  • నియోజకవర్గం
  • అభ్యర్థి
  • పుట్టిన తేదీ
  • పిల్లలు
  • విద్యార్హత
  • వృత్తి
  • రాజకీయ అనుభవం

న్యూస్‌టుడే, కమ్మర్‌పల్లి


  • నిజామాబాద్‌ అర్బన్‌
  • ధన్‌పాల్‌ సూర్యనారాయణ
  • 12-5-1958
  • భార్య : మణిమాల
  • ముగ్గురు కుమారులు, కుమార్తె
  • బీకాం ‌
  • వ్యాపారం
  • 1984లో విశ్వహిందూ పరిషత్‌లో సభ్యుడిగా చేరి జిల్లా అధ్యక్షుడి స్థాయికి చేరుకున్నారు. 2014లో రాజకీయాల్లోకి రావడంతో అందులో నుంచి బయటికొచ్చారు. అదే ఏడాది నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి భాజపా అభ్యర్థిగా ఎమ్మెల్యే టికెట్‌ దక్కడంతో పోటీ చేశారు. 27,000కు పైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. కొవిడ్‌ సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ధన్‌పాల్‌ లక్ష్మీబాయి విఠల్‌ గుప్తా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేదలకు ఆర్థిక సాయం, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించారు. ప్రస్తుతం భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం


  • ఆర్మూర్‌
  • పైడి రాకేశ్‌రెడ్డి
  • 10-03-1967
  • భార్య: రేవతిరెడ్డి
  • ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
  • ఇంటర్మీడియెట్‌ 
  • వ్యాపారం
  • నైన్‌ స్టార్‌ ఫౌండేషన్‌ ద్వారా హైదరాబాద్‌లో రూపాయికే వైద్యం(ఓపీ) ఇవ్వడంతో పాటు  ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తి చికిత్సలు అందిస్తున్నారు. యువత కోసం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కొద్ది నెలల క్రితం భాజపాలో చేరారు.

న్యూస్‌టుడే, ఆర్మూర్‌


  • కామారెడ్డి
  • కాటిపల్లి వెంకటరమణారెడ్డి
  • 1-1-1970
  • భార్య: విజయ
  • కొడుకు మైత్రేయ
  • వ్యాపారం, సామాజిక సేవాకార్యక్రమాలు
  • ఇంటర్మీడియెట్‌
  • 1999లో కాంగ్రెస్‌లో చేరారు. 2005 పుర ఎన్నికల్లో కామారెడ్డిలో కౌన్సిలర్‌గా పోటీచేసి ఓడిపోయారు. 2006లో కాంగ్రెస్‌ నుంచి తాడ్వాయి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2008-2011 వరకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2011లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2013 వరకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్‌గా పని చేశారు. 2014లో తెలంగాణ ఏర్పాటు.. రాజకీయ పరిణామాలు మారడంతో కాంగ్రెస్‌లో చేరారు. 2018లో భాజపాలో చేరారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ బకాయిలు చెల్లించాలని, కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై పోరాటం చేశారు. సామాజిక భవనాలు, ఆలయాలకు సొంత నిధులు ఇచ్చారు. నియోజకవర్గంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో మ్యానిఫెస్టో రూపొందించారు.

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం


  • జుక్కల్‌
  • టి.అరుణతార
  • 30-11-1972
  • తల్లిదండ్రులు: వసుంధర, ఆశీర్వాదం ‌్ర  ప్రజాసేవ
  • ఎం.కాం, ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం
  • తొలిసారిగా 1999లో తెదేపా తరఫున జుక్కల్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2004లో తెదేపా టికెట్‌ దక్కకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో భాజపాలో చేరి పోటీ చేశారు. అప్పుడూ ఓడిపోయారు. ప్రస్తుతం భాజపా జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.

న్యూస్‌టుడే, జుక్కల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని