logo

‘యూనిఫాం సివిల్‌ కోడ్‌తో ఇబ్బంది లేదు’

యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమల్లోకి వస్తే దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎంపీ అర్వింద్‌ భరోసా ఇచ్చారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సంతోషాన్నిచ్చిందన్నారు.

Published : 01 May 2024 04:54 IST

నందిపేట్‌ గ్రామీణం: యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమల్లోకి వస్తే దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎంపీ అర్వింద్‌ భరోసా ఇచ్చారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సంతోషాన్నిచ్చిందన్నారు. నందిపేట్‌, డొంకేశ్వర్‌లో మంగళవారం ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాటలు మార్ఫింగ్‌ చేసి చేస్తారా అంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. దిల్లీ పోలీసుల నుంచి సమాచారం రాగానే సీఎం రేవంత్‌రెడ్డి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. 13 ఏళ్లు తిప్పలుపడి కేసీఆర్‌ తెలంగాణ తెచ్చార[ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి భాజపాలోకి వస్తానంటే తమ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదని, తాను మాత్రం ఆహ్వానిస్తానన్నారు. సంచుల్లో పైసలు మోసిన కేసులో పోలీసులు ఈయనను వదిలిపెట్టరన్నారు. దోషిగా తేలితే జులై 14న సీఎం కూర్చీ ఖాళీ అవుతుందని చెప్పారు. సాయారెడ్డి, సురేందర్‌, గంగాధర్‌, గంగారాం, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు