logo

న్యాయం చేయాలని గుత్తేదారు నిరసన

తాను చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని ఓ గుత్తేదారు పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా.. గేట్‌కు తాళం వేసిన ఘటన బీర్కూర్‌ మండలకేంద్రంలో చోటుచేసుకుంది.

Published : 01 May 2024 05:10 IST

పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా గేట్‌కు తాళం

బీర్కూర్‌, న్యూస్‌టుడే : తాను చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని ఓ గుత్తేదారు పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా.. గేట్‌కు తాళం వేసిన ఘటన బీర్కూర్‌ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీర్కూర్‌కు చెందిన కుతాడి విజయ్‌కుమార్‌ అనే గుత్తేదారు 2021లో రూ.30 లక్షలతో పంచాయతీ కార్యాలయం ఎదుట వ్యాపార సముదాయ భవనాన్ని నిర్మించారు. 2022 మార్చిలో నిర్మాణం పూర్తి చేయడంతో అధికారులు రూ.20 లక్షల బిల్లును మంజూరు చేశారు. మిగితా రూ.10 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం పంచాయతీ కార్యాలయానికి డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎల్పీవో నాగరాజు తనిఖీకి వచ్చారు. విషయం తెలుసుకున్న గుత్తేదారు తొలుత పంచాయతీ గేట్‌ ముందువైపు తాళం వేసి నిరసన తెలిపారు. తర్వాత గేటు లోపలికి తాళం వేసి అధికారుల వద్దకు వెళ్లి తన సమస్యను విన్నవించారు. అప్పటి బీర్కూర్‌ సర్పంచి, పంచాయతీ కార్యదర్శి లంచం అడిగితే ఇవ్వలేదనే ఉద్దేశంతోనే గత రెండేళ్ల నుంచి తనకు రావాల్సిన బిల్లులు రాకుండా నిలిపివేశారని విజయ్‌కుమార్‌ ఆరోపించారు. బిల్లు ఇవ్వకుంటే పంచాయతీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని డీపీవో ఎదుట సదరు గుత్తేదారు కన్నీళ్లు పెట్టుకున్నారు. కలెక్టర్‌కి విషయం తెలిపి బిల్లు మంజూరు చేయిస్తానని డీపీవో శ్రీనివాస్‌రావు హామీ ఇవ్వడంతో గుత్తేదారు గేట్‌కు తాళం తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని