logo

దడ పుట్టిస్తున్న వడగాలులు

జిల్లాలో మంగళవారం ఎండ మండిపోయింది. భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతుండడంతో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి.

Published : 01 May 2024 05:06 IST

కామారెడ్డి వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో మంగళవారం ఎండ మండిపోయింది. భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతుండడంతో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. మంగళవారం అత్యధికంగా బిచ్కుందలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా అత్యల్పంగా పగటి పూట కామారెడ్డి జిల్లాకేంద్రంలలోని కలెక్టరేట్‌, సదాశివనగర్‌ మండలకేంద్రంలో 40 డిగ్రీల ఎండ కాచింది. జిల్లా అంతటా 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో.. ప్రజలు ఎండకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని