logo

ఇంటి వద్ద ఓటేసేది 1,758 మంది

నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు పార్లమెంటు ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించారు. కర్ణాటకలో ఈ పద్ధతి సత్ఫలితం ఇవ్వడంతో ఎన్నికల సంఘం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనవద్ద ప్రవేశపెట్టింది.

Published : 01 May 2024 04:59 IST

త్వరలో ప్రత్యేక బృందాల ఏర్పాటు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

డవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు పార్లమెంటు ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించారు. కర్ణాటకలో ఈ పద్ధతి సత్ఫలితం ఇవ్వడంతో ఎన్నికల సంఘం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనవద్ద ప్రవేశపెట్టింది. అదే విధానాన్ని పార్లమెంటు ఎన్నికల్లోనూ అమలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా దివ్యాంగ, 85 ఏళ్ల పైబడిన వృద్ధులను ముందుగానే గుర్తించారు. బీఎల్వోలు వారి ఇళ్లకు వెళ్లి 12డీ దరఖాస్తు ఫారాలు ఇచ్చారు. నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన ఏప్రిల్‌ 18 నుంచి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇందులో 85 ఏళ్లు పైబడిన వారు 859, దివ్యాంగ ఓటర్లు 899 మంది ఇంటి నుంచి ఓటేసేందుకు అర్హులుగా గుర్తించారు.

గట్టి భద్రత మధ్య..

పార్లమెంటు ఎన్నిక ఈ నెల 13న ఉండటంతో అంతకంటే ముందే ఇళ్ల వద్దకు వెళ్లి వీరితో ఓటు వేయిస్తారు. ప్రతి ఇంట్లో కంపార్ట్‌మెంటు ఏర్పాటు చేసి రహస్య పద్ధతిలో ఓటు వేయిస్తారు. ఇద్దరు పోలింగ్‌ అధికారులు, వీడియోగ్రాఫర్‌, పోలీసు అధికారి వారి ఇంటికి వెళ్తారు. అధికారులు నిర్దేశించిన కంపార్టుమెంటులో ఓటరు రహస్యంగా ఓటు హక్కు వినియోగించుకొని బ్యాలెట్‌ పెట్టెలో వేస్తారు. ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తారు. ఓటు వేసే సమయంలో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాలెట్‌ ముద్రణ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్‌ అధికారి తేదీలను ఖరారు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని