logo

ఈతకెళ్తున్నారా.. జర జాగ్రత్త

ఇలా వేసవి వచ్చిందంటే చాలు యువత, తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొని చెరువులు, కాల్వల్లో స్నానాలకు వెళ్తుంటారు. సరదాగా వేసవి తాపం తీర్చుకోవడానికి వెళ్లి వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు. ఇలా సరదా విషాదం నింపిన ఘటనలు అనేకం ఉన్నాయి.

Updated : 09 Mar 2024 04:56 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నేరవిభాగం

నాగారంలోని ఓ ప్రైవేటు ఈత కొలనులో  ఓ బాలుడు ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందాడు.

గతేడాది మెండోర దగ్గర కాకతీయ కెనాల్‌కు సరదాగా గడుపుదామని ముగ్గురు స్నేహితులు ఈతకు వెళ్లారు. వారిలో జిల్లా కేంద్రం గాయత్రినగర్‌కు చెందిన ఇద్దరు కెనాల్‌లో దిగేందుకు ప్రయత్నించగా కాలుజారి పడి మృతిచెందారు.

వేసవి వచ్చిందంటే చాలు ఆరో ఠాణా పరిధిలోని బాబన్‌సాబ్‌ దగ్గర నిజాం సాగర్‌ డీ 54  కెనాల్‌లో స్నానానికి వెళ్తుంటారు. గతేడాది ఇక్కడ ఇద్దరు చనిపోయారు.

2022 మే  2న సోన్‌ పుష్కరఘాట్‌లో స్నానానికి వెళ్లి ఒకరినొకరు పట్టుకునే ప్రయత్నంలో ఐదుగురు మృతి చెందారు.

ఇలా వేసవి వచ్చిందంటే చాలు యువత, తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొని చెరువులు, కాల్వల్లో స్నానాలకు వెళ్తుంటారు. సరదాగా వేసవి తాపం తీర్చుకోవడానికి వెళ్లి వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు. ఇలా సరదా విషాదం నింపిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ వేసవిలో అయినా కనీస జాగ్రత్తలు పాటించి సరదా సమయాన్ని విషాదం కాకుండా చూసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. కనీస సూచనలు పాటిస్తే నీటి గండం నుంచి బయటపడొచ్చు.

  • 15 ఏళ్లలోపు పిల్లలు చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి.
  • తల్లిదండ్రులు తీసుకెళ్తే మోకాలు, నడుము లోతు వరకే దిగేలా చూడాలి.
  • శిక్షకుడి పర్యవేక్షణలో ఈత నేర్పించాలి.
  • పూర్తిగా తర్ఫీదు పొందితేనే ఈత కొలనులో దిగేందుకు అనుమతించాలి.
  • యువత మద్యం, మత్తు పదార్థాలు తీసుకొని నీటిలోకి దిగవద్దు.
  • చెరువులు, కాల్వల్లో అధిక లోతులోకి వెళ్తూ సాహసాలు చేయకూడదు.
  •  చెరువుల్లోకి దిగేముందు ఇసుక తవ్వకాలు జరిపితే కందకాలు ఉంటాయి. వాటిని గమనించాలి. తవ్వకాలు జరిపే వైపు స్నానానికి వెళ్లకూడదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని