logo

మీ ఓటు ఉందా?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు.

Published : 28 Mar 2024 03:44 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. దీనికి మీరు చేయాల్సింది ఏమిటంటే.. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పొరపాటున ఓటు తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఏ అధికారి ఏం చేయని పరిస్థితి. ఇప్పుడే స్పందించి ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.

వెబ్‌సైట్‌: voters.eci.gov.in

ఒకవేళ మీ ఓటు గల్లంతైతే ఆందోళన చెందాల్సిన పని లేదు. పైన సూచించిన వెబ్‌సైట్‌లో ఫారం-6లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నింపి ఆన్‌లైన్‌లో కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మార్పులు చేర్పులకు ఫారం-8, పేరు తొలగించుకునేందుకు ఫారం-7లో వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఏప్రిల్‌ 15 వరకు గడువు ఉంది.

అందుబాటులో జాబితాలు

ఓటరు జాబితా ఫిబ్రవరి 8న విడుదల చేశారు. వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఎంపీడీవో, తహసీల్దార్‌, ఆర్డీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఉన్నాయి. స్థానికంగా ఉండే బీఎల్‌వో(బూత్‌ స్థాయి అధికారి)ల వద్ద జాబితా ఉంది. ఆయా చోట్లకు వెళ్లి చూసుకోవచ్చు. ఒకవేళ లేకుంటే ఫారం-6 తీసుకొని వివరాలు నమోదు చేసి అక్కడే అధికారులకు ఇవ్వొచ్చు. ఇందుకు కూడా ఏప్రిల్‌ 15 వరకు గడువు ఉంటుంది. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. జాబితాలో పేరుందో లేదో చూసుకోవడంతో పాటు పోలింగ్‌ బూత్‌, ఏరియా అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో చూసి సిబ్బంది చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని