logo

బాలాగౌడ్‌కు అత్యల్పం.. రాంగోపాల్‌రెడ్డికి అత్యధికం

ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.

Updated : 24 Apr 2024 06:42 IST

నిజామాబాద్‌లో మెజార్టీ ఇలా

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌: ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. 1984 ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తాడూరి బాలాగౌడ్‌కు 2,51,172 ఓట్లు రాగా తెదేపా నుంచి పోటీ చేసిన ఎం.నారాయణరెడ్డికి 2,48,628 ఓట్లు వచ్చాయి. తాడూరి బాలాగౌడ్‌ 2,547 స్వల్ప ఓట్లతో విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గడ్డం గంగారెడ్డికి 3,73,260 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి శనిగరం సంతోష్‌రెడ్డికి 3,69,824 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గడ్డం గంగారెడ్డి 3,436 మెజార్టీతో గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లో పోరు చివరి వరకు ఉత్కంఠగా సాగింది. దీనిని బట్టి ఆర్థం చేసుకోవచ్చు ఓటు ఎంత కీలకమని.

  • నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు ఎం.రాంగోపాల్‌రెడ్డి. 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.రాంగోపాల్‌రెడ్డికి 2,48,283 ఓట్లు రాగా తన ప్రత్యర్థి జనత పార్టీ అభ్యర్థి ఎంఎం.ఖాన్‌కు కేవలం 47,968 ఓట్లు ఇచ్చాయి. రాంగోపాల్‌రెడ్డి 2,00,315 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటికి ఆయన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెరాస(ప్రస్తుత భారాస) అభ్యర్థి కల్వకుంట్ల కవిత 1,67,184 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని