logo

పరీక్ష రుసుము చెల్లింపునకు అవకాశం

డా బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో 2017 విద్యా సంవత్సరానికి ముందు డిగ్రీలో ప్రవేశం పొందిన, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు బ్యాక్‌లాగ్‌ పరీక్ష రుసుము కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌రెడ్డి, అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయకర్త రంజిత శనివారం ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.200తో ఈ నెల 6 వరకు, రూ.500తో 13 వరకు అవకాశం ఉందన్నారు

Published : 05 May 2024 06:01 IST

ఇందూర్‌ సిటీ: డా బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో 2017 విద్యా సంవత్సరానికి ముందు డిగ్రీలో ప్రవేశం పొందిన, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు బ్యాక్‌లాగ్‌ పరీక్ష రుసుము కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌రెడ్డి, అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయకర్త రంజిత శనివారం ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.200తో ఈ నెల 6 వరకు, రూ.500తో 13 వరకు అవకాశం ఉందన్నారు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 20 వరకు ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 22 వరకు, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 24 నుంచి 29 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు www.braouonline.in లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని