logo

భారాస అధినేత కేసీఆర్‌ ప్రచారం నేడు

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భారాస వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ సోమవారం నిజామాబాద్‌ జిల్లాకు వస్తున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు.

Published : 06 May 2024 04:45 IST

సాయంత్రం 6.30కు గాంధీచౌక్‌ - నెహ్రూపార్క్‌ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, చిత్రంలో భారాస జిల్లా అధ్యక్షుడు
జీవన్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భారాస వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ సోమవారం నిజామాబాద్‌ జిల్లాకు వస్తున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డితో కలిసి ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జగిత్యాల నుంచి కేసీఆర్‌ కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, ఆర్మూర్‌ మీదుగా సాయంత్రం 5.30 గంటలకు నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ చౌరస్తాకు చేరుకుంటారని తెలిపారు. ర్యాలీగా తిలక్‌గార్డెన్‌, ప్రధాన బస్టాండు మీదుగా గాంధీచౌక్‌కు వస్తారని వెల్లడించారు. సాయంత్రం 6.30 గంటలకు గాంధీచౌక్‌ - నెహ్రూపార్క్‌ కూడలిలో ప్రజలు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. కేసీఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలని బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, బోధన్‌ నియోజకవర్గ సమన్వయకర్త అయేషా ఫాతిమా, నాయకులు ఎస్‌ఏ అలీం, ప్రభాకర్‌రెడ్డి, జగన్‌, మీర్‌ మజాజ్‌ అలీ పాల్గొన్నారు.

రాత్రి ఇక్కడే బస: నెహ్రూపార్క్‌- గాంధీ చౌరస్తాలో కేసీఆర్‌ కార్నర్‌ సమావేశం నేపథ్యంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆదివారం స్థల పరిశీలన చేశారు. ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని బిగాల గణేశ్‌ గుప్తా ఇంట్లో రాత్రి బస చేస్తారని, మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రముఖులతో సమావేశమై.. అనంతరం కామారెడ్డికి బయలుదేరుతారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని