ఓట్ల పండగకు ఆహ్వానం

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి.

Updated : 09 May 2024 15:05 IST

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటిదే పోలింగ్‌ ఆహ్వాన పత్రం ఒకటి. పోలింగ్‌ తేదీ సమయం ఈ నెల 13న ఉదయం  7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..వేదిక మీ పోలింగ్‌ స్టేషన్‌.. విందు ఐదేళ్ల పాటు శక్తిమంతమైన ప్రజాస్వామ్య ఫలాలు అంటూ ముద్రించిన ఆహ్వాన పత్రం అందరినీ ఆలోచింపజేస్తోంది. వివాహానికి ఆహ్వానిస్తే మంచి మనసుతో వెళ్లి నవవధూవరులను ఆశీర్వదిస్తుంటారు. అదే స్ఫూరితో ఎవరికీ ఆహ్వానం అందకున్నా.. మీ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి   ఆ రోజు ఓటు వేయండి. ఇది అందరూ బాధ్యతగా గుర్తించాలి.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌


ఓటరు చీటీ రాలేదా..!

పోలింగ్‌కేంద్రం, జాబితాలో క్రమసంఖ్య వివరాలతో కూడిన సంక్షిప్త సందేశం

న్యూస్‌టుడే, డిచ్‌పల్లి గ్రామీణం : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఊరూరా ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. ఓటరు స్లిప్పులు అందని వారు పోలింగ్‌ కేంద్రం, క్రమ సంఖ్యను ఇలా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయి. ఓటరు లిస్టులో గంటల తరబడి వెతికి ఏ క్రమ సంఖ్యలో తమ పేరు ఉందో సరి చూసుకోవడం కష్టమే. కేవలం చరవాణిలో ఓటరు కార్డు నెంబర్‌ను సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్‌) పంపడం ద్వారా పోలింగ్‌ బూత్‌ సంఖ్య, ఓటరు లిస్టులో పేరు ఏ నంబరులో ఉందో తెలుసుకునే సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించింది.

ఇలా చేయండి..

1950 టోల్‌ఫ్రీ నంబరుకు ఈసీఐ స్పేస్‌ ఇచ్చిన అనంతరం ఓటరు కార్డుపై ఉన్న ఆంగ్ల అక్షరాలు ఆ తర్వాత కార్డుపై ఉన్న ఏడు అంకెలను నమోదుచేసి ఎస్‌ఎంఎస్‌ పంపించాలి. (ఉదాహరణకు  ECI ABCxxxxx25) వెంటనే మీరు ఓటు వేసే పోలింగ్‌ బూత్‌ సంఖ్య, లిస్టులో క్రమసంఖ్యలు సంక్షిప్త సందేశంలో వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని