logo

బరిలోకి తండ్రి, కూతురు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నవరంగపూర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ తరఫున ఎంపీ స్థానానికి తండ్రి, ఎమ్మెల్యే స్థానానికి కుమార్తె బరిలో దిగనున్నారు.

Published : 06 Apr 2024 05:24 IST

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నవరంగపూర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ తరఫున ఎంపీ స్థానానికి తండ్రి, ఎమ్మెల్యే స్థానానికి కుమార్తె బరిలో దిగనున్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రదీప్‌ మాఝి 2021లో బిజదలో చేరటంతో పార్టీ అధిష్ఠానం భుజబల్‌కు ఎంపీ టికెట్‌ కేటియించింది. తండ్రి, కూతురు పార్టీ కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2014లో డాబుగావ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన భుజబల్‌ 2019లో 7000 ఓట్లు తేడాతో ఓటమి చవిచూశారు. ఈ సారి మాజీ ఎంపీలు బలభద్ర మాఝి, ప్రదీప్‌ మాఝీలతో తలపడనున్నారు. ప్రదీప్‌ పార్టీ వీడిన తరువాత జిల్లాలో కాంగ్రెస్‌కు బలం తగ్గింది. కుమార్తె లిపికాతో భుజబల్‌ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఆయన కుమార్తె లిపికామాఝి డాక్టర్‌ చదివి తండ్రి బాటలో ప్రజలకు సేవ చేసేందుకు 2022లో రాజకీయ జీవితం ప్రారంభించింది. ఆ ఏడాది సిటింగ్‌ ఎమ్మెల్యే మనోహర్‌ రంధారిని ఓడించిమొదటి సారిగా డాబుగావ్‌ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఎన్నికయింది. ప్రస్తుతం బిజద తరఫున మరోహర్‌, కాంగ్రెస్‌ తరఫున లిపికా డాబుగావ్‌ నియోజకవర్గానికి పోటీ చేయనున్నారు. ఈసారి కాంగ్రెస్‌, బిజదతో పాటు అనుభవం ఉన్న భాజపా అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండనుందని పలువురు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని