logo

మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం

కొంధమాల్‌ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్‌, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్‌వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు.

Published : 20 Apr 2024 03:03 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కొంధమాల్‌ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్‌, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్‌వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. దీంతో రానున్న ఎన్నికలను బహిష్కరించి, తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయా గ్రామస్థుల ప్రజలు నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో ఉన్న గొట్టపుబావుల్లోని నీరు తాగేందుకు ఉపయోగడపడడం లేదు. దీంతో మహిళలు కి.మీ. దూరాన ఉన్న కిరామహ కాలువ నీటిని ఒడగట్టుకుని తాగుతున్నారు. గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో రోగులను డోలీ కట్టి మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన బాలలు సుమారు ఐదు కి.మీ. దూరాన కుటిగుడలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతున్నారు. మూడు కిలోమీటర్ల దూరాన గుమాకియాలోని ప్రాథమిక పాఠశాలే వీరి చదువుకు ఆధారం. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని పుష్కరకాలంగా గ్రామస్థులు విన్నవిస్తున్నా పట్టించుకోవడంలేదు. మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధి నుంచి అధికారుల వరకూ అందరికీ పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో రానున్న ఎన్నికలను బహిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని