logo

పోటీకి నిలిచిన రోజు కూలీ, రాజ మేస్త్రీ

గంజాం జిల్లా అస్కా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భంజనగర్‌, అస్కా అసెంబ్లీ స్థానాలకు సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ తరపున రోజు కూలీ, మరో రాజ మేస్త్రీ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు.

Published : 30 Apr 2024 05:05 IST

నామినేషన్‌ పత్రం దాఖలు చేస్తున్న టునా మల్లిక్‌

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా అస్కా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భంజనగర్‌, అస్కా అసెంబ్లీ స్థానాలకు సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ తరపున రోజు కూలీ, మరో రాజ మేస్త్రీ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. భంజనగర్‌ సబ్‌కలెక్టరు కార్యాలయంలో భంజనగర్‌ అసెంబ్లీ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థి టునా మల్లిక్‌ నామినేషన్‌ వేయగా, అస్కా అసెంబ్లీ స్థానానికి రామచంద్ర బడత్యా నామినేషన్‌ దాఖలు చేశారు. టునా మల్లిక్‌ వృత్తి రీత్యా ఉపాధి కూలీ అని, బడత్యా రాజమేస్త్రీ అని సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ జిల్లా కార్యదర్శి శంకర్‌ ఇంక్విలాబ్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

అధికారికి నామినేషన్‌ పత్రం అందజేస్తున్న   రామచంద్ర బడత్యా. చిత్రంలో శంకర్‌ ఇంక్విలాబ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని