logo

సముద్ర ఉపరితలంలో గాలులు

బంగాళాఖాతం ఉపరితలంలో గాలులు వీస్తున్నాయని, సోమవారం నుంచి వీటి వేగం గంటకు 50 కిలోమీటర్లకుపైగా ఉంటుందన్న అంచనాతో తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసినట్లు గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ ఆదివారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Updated : 06 May 2024 07:01 IST

చేపల వేటపై ఐఎండీ ఆంక్షలు

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: బంగాళాఖాతం ఉపరితలంలో గాలులు వీస్తున్నాయని, సోమవారం నుంచి వీటి వేగం గంటకు 50 కిలోమీటర్లకుపైగా ఉంటుందన్న అంచనాతో తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసినట్లు గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ ఆదివారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. దీనిపై విపత్తుల నివారణశాఖ (ఓఎస్‌డీఎంఏ) యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 6 నుంచి 8 వరకు సముద్ర కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని, ఈ మూడు రోజులు చేపల వేట నిలిపివేయాలని సూచించామన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగినా ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సోమవారం నుంచి స్వల్పంగా తగ్గుతాయన్న అంచనా ఉందన్నారు. బాలేశ్వర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌, కేంద్రపడ, కటక్‌, జగత్సింగ్‌పూర్‌, పూరీ, ఖుర్దా, నయాగఢ్‌, గంజాం, గజపతి, కేంఝర్‌, మయూర్‌భంజ్‌, అనుగుల్‌, ఢెంకనాల్‌, కొంధమాల్‌, రాయగడ, కొరాపుట్‌, కలహండి జిల్లాల్లో సోమవారం కాలవైశాఖి ప్రభావం చూపే సూచనలు ఉన్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. 8వ తేదీ వరకు రాష్ట్రంలో గాలివానకు అవకాశం ఉన్నందున ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న అంచనా ఉందన్నారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఓఎస్‌డీఎంఏ అధికారులు తీర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని