logo

భాజపా మేనిఫెస్టో విడుదల

రాష్ట్రంలో బిజద అవినీతి పాలనకు తెరదించడానికి కృషి చేస్తున్న భాజపా అభివృద్ధే ఎజెండాగా చేసుకుందని, మోదీ గ్యారంటీని ‘విజన్‌ డాక్యుమెంట్‌’గా అమలు పరుస్తామని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌ వచ్చిన ఆయన ఓ హోటల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.

Published : 06 May 2024 04:00 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

ప్రసంగిస్తున్న జె.పి.నడ్డా

రాష్ట్రంలో బిజద అవినీతి పాలనకు తెరదించడానికి కృషి చేస్తున్న భాజపా అభివృద్ధే ఎజెండాగా చేసుకుందని, మోదీ గ్యారంటీని ‘విజన్‌ డాక్యుమెంట్‌’గా అమలు పరుస్తామని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌ వచ్చిన ఆయన ఓ హోటల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.

  • యువత, మహిళలు, అన్నదాతలు, పేదల వికాసానికి పెద్దపీట.
  • ‘సుభద్ర’ పథకం కింద ప్రతి, మహిళకు రూ.50 వేల నగదు వోచర్లు చెల్లిస్తాం, బ్యాంకుల్లో ఈ సొమ్ము తీసుకోవచ్చు.
  • 25 లక్షల మంది మహిళలకు ‘లక్షపతి దీదీ’ లుగా చేస్తాం. అంకురాలు ప్రారంభిస్తాం.
  • 2029లోగా 3.5 లక్షల మంది యువతీ యువకులకు ప్రభుత్వోద్యోగాలు.
  • మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)తో 500 ఎంఎస్‌ఎంఈల స్థాపన.
  • రాష్ట్రానికి 15 లక్షల పీఎంఏవై ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీల్లో ఉంటున్న పేదకుటుంబాలకు 600 చదరపు అడుగుల ఉచిత స్థలాలు.
  • విపత్తుల కాలంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున నగదు చెల్లింపులు.
  • 75,000 గ్రామాలకు ప్రపంచస్థాయి రోడ్డు సౌకర్యం.
  • పంటపొలాలకు సాగునీరు, శీతల గిడ్డంగులకు ప్రాధాన్యం, ధాన్యం క్వింటాలుకు రూ.3,100లు కొనుగోలు, మండీల్లో అవినీతి నిర్మూలన.
  • మంచాన పడ్డ ప్రభుత్వాసుపత్రుల ఆధునికీకరణ, వైద్య సిబ్బంది నియామకం, డయాలిసిస్‌ సౌకర్యాలు.
  • అధికారానికి వచ్చిన 18 నెలల్లో చిట్‌ఫండ్‌ బాధితులకు చెల్లింపులు.
  • ఖనిజ సంపద సద్వినియోగం చేస్తాం, వలసలు పూర్తిగా నివారిస్తాం.
  • వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్లు రూ.3 వేలు చేస్తాం.
  • అధికారానికి వచ్చిన తొలి రోజు పూరీ జగన్నాథుని రత్న బాంఢాగారం తెరిపిస్తాం. సంపద లెక్కింపు చేయిస్తాం. శ్రీక్షేత్రం నాలుగు ద్వారాలు తెరుస్తాం. భక్తులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తాం. కారిడార్‌ పనుల్లో తొలగించిన మఠాలు పునర్నిర్మాణం చేయిస్తాం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని