logo

మన్యంలో గజరాజుల హల్‌చల్‌

సీతంపేట మన్యంలో మరోసారి గజరాజులు హల్‌చల్‌ చేశాయి. ఇంతవరకు సీతంపేట- పాలకొండ సరిహద్దు ప్రాంతంలోని బొల్లకొండలో తిష్ఠ వేసినట్లు అటవీ శాఖాధికారులు భావించారు.

Published : 05 Oct 2022 03:34 IST


పత్తికగూడలో పొలాల్లో తిరుగుతున్న ఏనుగులు

సీతంపేట, కొమరాడ, న్యూస్‌టుడే: సీతంపేట మన్యంలో మరోసారి గజరాజులు హల్‌చల్‌ చేశాయి. ఇంతవరకు సీతంపేట- పాలకొండ సరిహద్దు ప్రాంతంలోని బొల్లకొండలో తిష్ఠ వేసినట్లు అటవీ శాఖాధికారులు భావించారు. కానీ మంగళవారం సాయంత్రం మండలంలోని మండ, జక్కరవలస, పత్తికగూడ, కిట్టాలపాడు తదితర గ్రామాల మీదుగా సంచరించాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు.
జొన్న పంటకు నష్టం.. కొమరాడ మండలంలోని తొడుము- కోదులగుంప మధ్య గజరాజులు సోమవారం సంచరించాయి. అక్కడ సమీపంలోని జొన్న, పత్తి, వరి పొలాల్లో తిరగడంతో పంటలు పాడైనట్లు రైతులు చెబుతున్నారు. 27 ఎకరాల్లో జొన్నకు నష్టం వచ్చిందన్నారు.  మంగళవారం ఆయా ప్రాంతాలను కురుపాం అటవీ రేంజీ అధికారి రాజబాబు సందర్శించారు. బాధిత రైతులు, గ్రామస్థులతో మాట్లాడారు. పంట నష్టాలపై నివేదిక తయారు చేసి పరిహారం అందేలా చూస్తామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని