logo

ధాన్యం కొనండి మహాప్రభో

పార్వతీపురం మండలం జమదాల, జమ్మిడివలస గ్రామాల్లో మిగిలి ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని పలువురు రైతులు కలెక్టరేట్‌ ముందు సోమవారం నిరసన తెలిపారు.

Updated : 31 Jan 2023 04:47 IST

కలెక్టరేట్‌ ముందు నిరసన తెలుపుతున్న జమదాల రైతులు

కలెక్టరేట్‌ ప్రాంగణం, న్యూస్‌టుడే: పార్వతీపురం మండలం జమదాల, జమ్మిడివలస గ్రామాల్లో మిగిలి ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని పలువురు రైతులు కలెక్టరేట్‌ ముందు సోమవారం నిరసన తెలిపారు. రెండో విడతలో కొంటామని చెప్పి పది రోజులవుతున్నా ఒక్క గింజ కూడా తీసుకోలేదన్నారు. జమగాల పరిధిలో కల్లాల్లోనే రెండు వేల ధాన్యం బస్తాలు ఉన్నాయన్నారు. సీతానగరం, కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే రైతుల నుంచి పంట సమాచారం సేకరించామని, ప్రభుత్వం అనుమతి ఇస్తే సేకరణ ప్రారంభిస్తామని పౌర సరఫరాల అధికారులు  తెలిపారు.


వినతి..

పాలకొండ, న్యూస్‌టుడే: జిల్లాలో రైతుల వద్దనున్న ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస మండలాల్లో ఇంకా చాలాచోట్ల పొలాల్లోనే పంట ఉందన్నారు. నాయకులు కె.రామ్మూర్తినాయుడు, సీహెచ్‌.లక్ష్మీనారాయణ, బి.వెంకటరమణ, పి.రమణ, బి.పారినాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని