logo

ఘనంగా రాములోరి చక్రస్నానం

రామతీర్థం పుణ్యక్షేత్రంలో తిరుక్కల్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారి చక్రస్నానం ఘట్టం ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణం, రథయాత్ర తర్వాత పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు పలికారు.

Published : 06 Feb 2023 04:29 IST

భాస్కర పుష్కరిణిలో స్వామికి చక్రస్నానం చేస్తున్న అర్చకులు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: రామతీర్థం పుణ్యక్షేత్రంలో తిరుక్కల్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారి చక్రస్నానం ఘట్టం ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణం, రథయాత్ర తర్వాత పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు పలికారు. ఉదయం  మంగళవాయిద్యాలతో చక్ర పెరుమాళ్లను ఊరేగింపుగా భాస్కర పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. వేదమంత్రాల మధ్య చక్రస్నానం జరిపించారు. అక్కడి నుంచి దేవస్థానానికి తరలించి ప్రత్యేక పూజలు చేశారు.  యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం ధ్వజ అవరోహణం చేపట్టారు. పూజాధికాల్లో ఈవో డీవీవీ ప్రసాదరావు, భక్తులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు