logo

విద్యుదాఘాతంతో కార్మికుడి దుర్మరణం

విద్యుత్తు స్తంభాలు మార్చేక్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన మండలంలో జరిగింది.

Published : 30 Mar 2023 02:14 IST

డెంకాడ, న్యూస్‌టుడే: విద్యుత్తు స్తంభాలు మార్చేక్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన మండలంలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం తొత్తడాం గ్రామానికి చెందిన కె.అప్పలనాయుడు(36) ప్రయివేటు కాంట్రాక్టర్‌ వద్ద విద్యుత్తు కార్మికుడిగా పనిచేస్తున్నారు. బుధవారం మండలంలోని బెల్లాంలో విద్యుత్తు స్తంభాలు మార్చే ప్రక్రియలో భాగంగా పనులు చేస్తుండగా 11 కేవీ తీగకు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఎస్సై మహేష్‌, విద్యుత్తుశాఖాధికారులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అప్పలనాయుడుకు భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఝాన్సీ, హరిణి ఉన్నారు. తమకు ఇక దిక్కెవరంటూ భార్య, పిల్లలు రోదిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని