logo

గి.సం. ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, నాలుగో తరగతి సిబ్బంది బదిలీలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను మంగళవారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో నిర్వహించారు.

Published : 31 May 2023 03:25 IST

సీతంపేటలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, నాలుగో తరగతి సిబ్బంది బదిలీలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను మంగళవారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో నిర్వహించారు. పీవో విష్ణుచరణ్‌ పర్యవేక్షించారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా బదిలీలు చేయాలని పీవో ఆదేశించారు.


గి.స.శాఖలో..

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, నాలుగో తరగతి ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్‌ను ఐటీడీఏ కార్యాలయంలో గి.స.శాఖ డీడీ బి.నగేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. 77 మంది హాజరు కాగా.. 40 మందికి బదిలీ అయినట్లు తెలిపారు. ఓఎస్డీ ఎం.యుగంధర్‌, ఏఎంవో కోటిబాబు, సీఎంవో చిరంజీవులు, జీసీడీవో రాములమ్మ పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని