నేడు రైతులకు ట్రాక్టర్ల పంపిణీ
వైఎస్సార్ యంత్రసేవా పథకంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని రైతులకు ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ఇవ్వనున్నారు.
విజయనగరం వ్యవసాయవిభాగం, పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: వైఎస్సార్ యంత్రసేవా పథకంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని రైతులకు ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి కోట ప్రాంతంలో వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. గురువారం సాయంత్రం అయోధ్య మైదానానికి వాహనాలు చేరుకున్నాయి. జిల్లాలోని 184 రైతు సంఘాలకు రూ.15.20 కోట్ల విలువైన రోటోవేటర్లు, నూర్పిడి యంత్రాలు, స్ప్రేయర్లు, పవర్‌వీడర్లు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, వాటితో నడిపే యంత్ర పరికరాలు ఇస్తారు. వాటిపై రూ.4.54 కోట్ల రాయితీ వర్తించనుంది. ఈ నిధులన్నీ సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లో జమకానున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా అధికారులు హాజరు కానున్నారు. రి మన్యం జిల్లాలో 78 సంఘాలకు ఇవ్వనున్నట్లు వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్ చెప్పారు. ఒక్కో యూనిట్ విలువ రూ.15 లక్షలు ఉంటుందని, అందులో 40 శాతం రాయితీ, 50 శాతం బ్యాంకు రుణం, మరో 10 శాతం నిధులు గ్రూపు సభ్యులు చెల్లించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
NDA: పొత్తు కుదిరింది.. ఎన్డీయేలో చేరిన జేడీఎస్
-
IndiGo: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి ఆత్మహత్యాయత్నం..
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ