logo

Parvathipuram: ఈ గుడ్లు తింటే అంతే..

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు విధిగా గుడ్లు అందించాలి. పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంపిణీ జరగాలి.

Updated : 05 Oct 2023 07:48 IST

పార్వతీపురం పట్టణం బైపాస్‌ కాలనీలోని అంగన్‌వాడీలో లబ్ధిదారులకు ఇచ్చిన గుడ్లు

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు విధిగా గుడ్లు అందించాలి. పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంపిణీ జరగాలి. ఇటీవల ఇంటికే పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే కేంద్రాల ద్వారా అందిస్తున్న సరకుల్లో నాణ్యతా లోపం బయట పడుతోంది. వారిచ్చే గుడ్లను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పార్వతీపురంలోని బైపాస్‌ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం ఇద్దరు బాలింతలకు గుడ్లు ఇచ్చారు. ఇంటికి తీసుకువచ్చి చూస్తే అన్నీ కుళ్లిపోయాయి. లోపలి సొన అంతా నల్లగా మారి, దుర్వాసన వస్తోందని వారు తెలిపారు. గతంలో కూడా ఇలాంటివే ఇచ్చారని, అన్నీ పారబోసినట్లు ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లను పర్యవేక్షకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పరిశీలించాలి. నిల్వ ఉన్నా.. పాడైపోయినా వెంటనే తిప్పి పంపాలి. కానీ ఎక్కడా పరిశీలన జరగడం లేదు. ఆ పరిస్థితికి ప్రస్తుత ఘటన అద్దం పడుతోంది. ఈ విషయాన్ని జిల్లా మహిళా సంక్షేమ సాధికారత అధికారిణి విజయగౌరి వద్ద ప్రస్తావించగా.. దీనిపై దర్యాప్తు చేయిస్తామని, లబ్ధిదారులకు మంచి గుడ్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని
చెప్పారు.

న్యూస్‌టుడే, పార్వతీపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని