logo

బ్యాంకులో ఖాతాల సవరింపు

సామాజిక పింఛన్ల బట్వాడా ప్రక్రియ బ్యాంకుల ద్వారా చేపట్టడం వృద్ధులకు ప్రాణసంకటంగా మారింది. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా పింఛన్ల భృతి కోసం వృద్ధులు కాలినడకన బ్యాంకునకు వచ్చి వారి ఖాతాలను సరిచేయించుకునేందుకు వరుస కట్టారు.

Updated : 04 May 2024 19:34 IST

బలిజిపేట: సామాజిక పింఛన్ల బట్వాడా ప్రక్రియ బ్యాంకుల ద్వారా చేపట్టడం వృద్ధులకు ప్రాణసంకటంగా మారింది. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా పింఛన్ల భృతి కోసం వృద్ధులు కాలినడకన బ్యాంకునకు వచ్చి వారి ఖాతాలను సరిచేయించుకునేందుకు వరుస కట్టారు. వీరిని వరుస క్రమంలో నిలబెట్టి బ్యాంకు సిబ్బంది పింఛనర్ల బ్యాంకు ఖాతాలను సరిచేశారు. శనివారం బలిజిపేట, తుమరాడ, పలగర, వెంగాపురం, నారాయణపురం, చెల్లింపేట, మిర్తివలస, చిలకలపల్లి, నూకలవాడ, పొగాకు రావివలస గ్రామాలకు చెందిన 150 మంది పింఛనుదారులు తమ బ్యాంకు ఖాతాలను బతికించుకునేందుకు యూనియన్‌ బ్యాంకు శాఖకు వచ్చారు. వీరికి బ్యాంకు యాజమాన్యం అవసరమైన నగదును కట్టించుకుని ఖాతాలు బతికించారు. 

కాటికి కాలు చాపుకొని ఉన్న తనకు బ్యాంకునకు వెళ్లమంటున్నారు: పడాల గంగమ్మ, వృద్ధాప్యపింఛనుదారురాలు, తుమరాడ గ్రామం, బలిజిపేట మండలం

వృద్ధాప్యంతో నడవలేని స్థితిలో ఉన్న తాను కాటికి కాలు చాపుకొని ఉన్నాను. ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛను ఇచ్చేవారు. బ్యాంకు ఖాతా సరిచేయించుకునేందుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనియన్‌ బ్యాంకునకు నేనెలా వెళ్లగలను. వేసవి ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఈ పరిస్థితుల్లో బ్యాంకునకు ఎలా వెళ్లగలను. ఇంటి వద్దకు వచ్చి పింఛను అందించేలా చూడండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని