logo

జనం భూమిలో.. జగన్‌ చిచ్చు

వైకాపా సర్కార్‌ కుట్రపూరితంగా తీసుకొస్తున్న ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్‌ యాక్ట్‌-2022) ప్రజల భూముల పాలిటి ముప్పులా మారింది.

Updated : 05 May 2024 05:55 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’తో స్థిరాస్తులు దోచుకునేందుకు కుట్ర

 

న్యూస్‌టుడే, రాజాం, గజపతినగరం, బొబ్బిలి గ్రామీణం

వైకాపా సర్కార్‌ కుట్రపూరితంగా తీసుకొస్తున్న ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్‌ యాక్ట్‌-2022) ప్రజల భూముల పాలిటి ముప్పులా మారింది. భూ యాజమాన్య హక్కులను తేల్చే అధికారాన్ని సివిల్‌ కోర్టుల పరిధి నుంచి తొలగించి.. అధికారులకు అప్పగించడంతో స్థిరాస్తులకు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు.

  • దోపిడీ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఆస్తులను వివాదాస్పదంగా మార్చి... నిజమైన భూ యజమానిని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని, తనే యజమాని అని నిరూపించుకునేందుకు.. ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ అధికారి, హైకోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

లోపాల నిలయం

ల్యాండ్‌ టైటిలింగు చట్టం పూర్తిగా లోపాలమయంగా ఉంది. రైతుకు ఏమాత్రం మేలు జరగదు. ఎవరి భూమి ఎవరైనా హక్కుదారునిగా పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదు. వివాదాలు పెరిగి శాంతిభద్రతలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంటుంది.
- జెర్రిపోతుల జగదీష్‌, న్యాయవాదుల సంఘ సంయుక్త కార్యదర్శి, గజపతినగరం


భూములకు రక్షణ కరవు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంలో భూముల యజమానులకు రక్షణ పూర్తిగా ఉండదు.  వారికి తెలియకుండానే భూములు కోల్పోతారు. టైటిలింగ్‌ అధికారి చెప్పిందే చెల్లుబాటవుతుంది. ఆయన స్వార్థానికి పనిచేస్తే ఇక భూమిలేనట్లే అనుకోవాలి. ఇది పూర్తిగా హక్కుదారుల వ్యతిరేక చట్టం. ప్రజలు గమనించాలి. లేకుంటే ఎవరికీ భూమి ఉండదనేది స్పష్టమవుతోంది. దీనిపై అవగాహన అవసరం. 

- బిట్రా సూర్యారావు, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు, గజపతినగరం


అమ్మకానికి అడ్డంకులు

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ముసుగులో స్థిరాస్తులు దోచుకునే కుట్ర జరుగుతోంది. నిరక్షరాస్యులు, చిన్న, సన్నకారు రైతుల భూములకు ఇప్పటి వరకూ ఉండే హక్కు పత్రాలు, దస్తావేజులు చిత్తుకాగితాలతో సమానంగా మారిపోతాయి. ఎవరైనా భూమిని వివాదాస్పదం చేస్తే అమ్మకానికి వీలుండదు. బ్యాంకు రుణాలకు నోచుకోలేరు. రాజకీయ పెత్తనానికి అవకాశం ఏర్పడుతుంది. టైౖటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కీలకంగా మారుతారు. ఇబ్బందులు వస్తాయి.  
- గురవాన నారాయణరావు, న్యాయవాది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని