logo

అల్లరిమూకలకు హెచ్చరిక

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఎదురయ్యే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలైనా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామనే సంకేతం ఇచ్చే విధంగా మార్కాపురంలో పోలీసులు నిర్వహించిన మాబ్‌ ఆపరేషన్‌ (మాక్‌ డ్రిల్‌) స్థానికులను ఆకట్టుకుంది.

Published : 23 May 2024 02:20 IST

తుపాకీ ఎక్కుపెట్టి అల్లరిమూకలు వెళ్లిపోవాలంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న పోలీసులు 

మార్కాపురం నేర విభాగం న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఎదురయ్యే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలైనా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామనే సంకేతం ఇచ్చే విధంగా మార్కాపురంలో పోలీసులు నిర్వహించిన మాబ్‌ ఆపరేషన్‌ (మాక్‌ డ్రిల్‌) స్థానికులను ఆకట్టుకుంది. బుధవారం సాయంత్రం స్థానిక గడియార స్తంభం కూడలిలో ఏఆర్, సివిల్, ఫైర్‌ సిబ్బంది అల్లర్ల సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సామాన్య ప్రజానీకానికి ఎలా రక్షణ కల్పిస్తారనే అంశాలపై పోలీసుల ప్రదర్శనలు సాగాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు తక్షణమే వెళ్లిపోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ అశోక్‌ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాలసుందరరావు, సీఐ వెంకటేశ్వర్లు, పట్టణ, గ్రామీణ ఎస్సైలు అబ్దుల్‌ రహమాన్, వెంకటేశ్వరనాయక్, సిబ్బంది పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని