logo

ఇతరులను లోనికి రానీయొద్దు

ఒంగోలు సమీపంలోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ బుధవారం పరిశీలించారు.

Published : 23 May 2024 02:48 IST

స్ట్రాంగ్‌ రూమ్‌ సీలును పరిశీలిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌  

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు సమీపంలోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్‌ రూమ్‌లకు వేసిన సీలుతో పాటు, అక్కడ భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీల నిఘాను తనిఖీ చేశారు. కళాశాల ప్రాంగణం మొత్తాన్ని సీసీ టీవీ పర్యవేక్షణలో ఉంచామని, గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించవద్దని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గడువులోపు పనులు పూర్తయ్యేలా చూడాలని, అవసరమైతే కూలీలను పెంచాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఒంగోలు ఆర్డీవో జీవీ.సుబ్బారెడ్డి ఉన్నారు.

జిల్లాకు చేరిన 1,185 సర్వీసు ఓట్లు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఒంగోలు పార్లమెంట్‌కు చెందిన 1,185 సర్వీసు ఓట్లు ఒంగోలు చేరాయి. జిల్లాలో మొత్తం 6,693 సర్వీసు ఓట్లున్నాయి. అందులో బుధవారానికి 1,185 వచ్చాయి. తపాలా ద్వారా వచ్చిన వీటిని రాజకీయ పార్టీల ప్రతినిధులకు చూపించి పోస్టల్‌ బ్యాలెట్‌ పెట్టెలో వేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక కలెక్టర్‌ కె.ఝాన్సీలక్ష్మి పర్యవేక్షించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని